Connect with us

Entertainment

Bigg Boss 8 Telugu Day 32: అర్థరాత్రి ఊహించని ఎలిమినేషన్..

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మధ్యలో కంటెస్టెంట్ వెళ్లిపోయేందుకు చేసే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియను అర్థరాత్రి మొదలుపెట్టాడు బిగ్ బాస్. దీంతో హౌజ్‌మేట్స్‌కు పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది.

బిగ్ బాస్ మెగా చీఫ్ టాస్క్ అయిన తర్వాత సుమారు 11 గంటల సమయంలో హౌజ్‌లో లైట్స్ బ్లింక్స్ అవుతూ సైరన్ మోగింది. దాంతో ఏం జరుగుతుందని హౌజ్‌మేట్స్ చాల కంగారుపడ్డారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారేమో అని పృథ్వీ అనుకున్నాడు. కానీ, కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి వచ్చి నిలబడమని బిగ్ బాస్ చెప్పాడు.

దాంతో పదిమంది కంటెస్టెంట్స్ వచ్చి గార్డెన్ ఏరియాలో నిల్చున్నారు. ఈ రాత్రి ఒకరికి పీడకలగా మారుతుందని, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇప్పుడు జరుగుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేసేసాడు. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. బిగ్ బాస్ ఐదోవారం నామినేషన్స్‌లో ఉన్న నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, నాగ మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్ బాస్ చెప్పాడు.

వారిలో నిఖిల్, నబీల్, నాగ మణికంఠ ఎక్కువ ఓటింగ్‌తో ఈరోజుకు సేవ్ అయినట్లు బిగ్ బాస్ చెప్పాడు. ఓటింగ్ చివరిలో ఉన్న విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓంను తమ బ్యాగ్స్ సర్దుకోమ్మని బిగ్ బాస్ చెప్పాడు. ఇక హౌజ్‌మేట్స్‌కు వీడ్కోలు పలికి, బ్యాగ్స్ సర్దుకోమ్మని కొంత సమయం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నాకు వెళ్లాలని లేదు అంటూ నైనిక ఏడ్చింది. తనను ప్రేరణ, సీత, నిఖిల్ ఓదార్చారు.

తర్వాత అంతా బ్యాగ్ సర్దుకుని గార్డెన్ ఏరియాకు వచ్చారు. ఆ ముగ్గురు నిల్చున్న ముందు హౌజ్ గేట్‌కు ఎదురుగా కొన్ని లైన్స్ వేశారు. వారిలో ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయని మీరు అనుకుంటున్నారో కారణాలు చెప్పి ఒక అడుగు ముందుకు తీసుకురావాల్సిందిగా మిగతా కంటెస్టెంట్స్‌కు చెప్పాడు బిగ్ బాస్. అంటే ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ హౌజ్ నుంచి వెళ్లి పోయేలా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

Advertisement

ఒక్కొక్కరు ఒక్కో కారణంతో డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను ముందుకు నడిపించారు. ఆదిత్య ఓంను నిఖిల్, నాగ మణికంఠ, యష్మీ, సీత ముందుకు నడిపించారు. నైనికను పృథ్వీ, ప్రేరణ ముందుకు తీసుకొచ్చారు. విష్ణుప్రియను నబీల్ ముందుకు తీసుకొచ్చాడు. ఇక అందరికంటే ఎక్కువ ఓట్లు, అలానే అడుగులతో ఆదిత్య ఓం ముందులో ఉన్నాడు.

ఇక ఎం ఉంది ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం ఈరోజు ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరో కాదు ఆదిత్య ఓం గారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేసేసాడు. దాంతో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. ఇక అందరికీ గుడ్ బై చెప్పి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు ఆదిత్య ఓం. అర్థరాత్రి ఊహించని ఎవిక్షన్ అని చెప్పినప్పటినుంచి సీత ఏడుస్తూనే ఉంది. తాను ఎవరినైనా హర్ట్ చేసుంటే క్షమించమని చెప్పింది.

Loading

Trending