Entertainment
Bigg Boss Telugu Elimination: బిగ్‌బాస్ నుంచి నైనిక ఔట్..

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయిపోయిన సంగతి మనకి తెలిసిందే. ముందుగా బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం ఇక ఈ ఐదు మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక తాజాగా నైనిక కూడా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఎలిమినేషన్‌కి ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి నాగార్జున గారు హౌస్‌లో చెప్పారు. కానీ వాళ్లందిరినీ మడతెట్టేస్తాం అంటూ ఓజీ గ్యాంగ్ గట్టిగానే ధీమాగా చెప్పింది.
మాములు కాన్ఫిడెన్స్ కాదయ్యో
ఈరోజు గేమ్ ఛేంజర్‌లోని రా మచ్చా మచ్చా పాట కి స్టెప్పులేసి ఎంట్రీ ఇచ్చారు మన నాగార్జున గారు. ఇక తర్వాత అప్పటికే నామినేషన్స్‌లో ఉన్న మణికంఠ, నైనిక, విష్ణుప్రియలను నిల్చోబెట్టారు. వీరి నుంచి విష్ణుప్రియను సేవ్ చేశారు నాగ్. ఇక ఈరోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవబోతున్నారు.. మీరు రెడీనా అంటూ నాగ్ సర్ అడిగారు. దీంతో ఆటకైనా మాటకైనా పర్ఫెక్ట్‌గా ఉన్నాం.. రెడీగా ఉన్నాం.. అంటూ మెగా చీఫ్ నబీల్ చెప్పాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఎలా ఎదుర్కొంటారు చెప్పండి నాకు.. అంటూ నాగార్జున గారు అడిగారు.
దీంతో సార్.. వైల్డ్ కార్డ్ అతిథి దేవో భవ.. ప్రేమతో మెప్పించి మెల్లమెల్లగా వాళ్లని బయటికి పంపిస్తాం..అంటూ విష్ణు చెప్పింది. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా డైలాగులు కొట్టారు. ఇక నిఖిల్ అయితే.. ఒక్కొక్కరి బలం మాకు తెలుసు.. ఏ టైమ్‌లో ఎవరిని ఆడించాలో మాకు బాగా తెలుసు.. మేము రెడీగా ఉన్నాం సర్.. అంటూ చెప్పాడు. ఇక మరోవైపు పృథ్వీ అయితే “సింహాన్ని బోన్ బయటి నుంచి చూస్తే బానే ఉంటుంది.. కానీ లోపలికి వస్తే కదా చాలా తేడా ఉంటుంది..” అంటూ పంచ్ డైలాగ్ కొట్టేసాడు.
మణికంఠకి వెన్నుపోటు
ఇక తర్వాత హౌస్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లకి ఓజీ అనే టైటిల్ ఇచ్చారు నాగార్జున అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్. తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న మణికంఠ-నైనికలను కాస్త టెన్షన్ పెట్టి చివరికి నైనిక ఎలిమినేట్ అంటూ నాగ్ అనౌన్స్ చేశారు. ఇక మణికంఠ మళ్లీ సేవ్ అయ్యాడని తెలిసి ప్రేరణ, యష్మీ సహా అందరూ షాకయ్యారు. అయితే సేవ్ అవ్వగానే ఇండైరెక్ట్‌గా నాగార్జునకి ఓ కౌంటర్ వేశాడు మణికంఠ. “థాంక్యూ ఆడియన్స్ మీరు నన్ను అర్థం చేసుకున్నట్లు.. ఇంకెవరు అర్థం చేసుకోవట్లేదు..” అంటూ మణికంఠ చెప్పాడు. అంటే కంటెస్టెంట్లతో పాటు హోస్ట్ నాగార్జున కూడా నన్ను అర్థం చేసుకోలే అన్నట్లు చెప్పాడు మణికంఠ.
ఇక ఆ తర్వాత నైనిక హౌస్ నుంచి వెళ్లిపోతుంటే మిస్ యూ నైనూ అంటూ సీత గట్టిగానే ఏడ్చేసింది. ఆ తర్వాత స్టేజ్ మీదకి రాగానే నైనిక జర్నీ వీడియో చూపించారు నాగ్ సర్. నా జర్నీ చూశాక ఐయామ్ హ్యాపీ అంటూ నైనిక చెప్పింది. తర్వాత ఆమెకు ఓ డైరీ ఇచ్చి అందులో ఉన్న ట్యాగ్స్ నువ్వు ఒక్కొక్కరికీ ఇవ్వాలంటూ నాగ్ సర్ చెప్పారు. దీంతో మ్యానుపులేటర్ అనే ట్యాగ్ ప్రేరణకి ఇచ్చింది నైనిక. వెన్నుపోటు పొడిచే వ్యక్తి అనే ట్యాగ్ మణికంఠకి ఇచ్చింది. నాకు చాలా సార్లు వెన్నుపోటు అయింది మణికంఠ వల్లే.. అంటూ చెప్పుకొచ్చింది నైనిక. ఇక ఫేక్ ఫ్రెండ్ ఏమో.. విష్ణుకి, అటెన్షన్ సీకర్ ఏమో.. పృథ్వీకి, అవకాశవాది ఏమో.. నబీల్‌కి, రియల్ ఫ్రెండ్ ఏమో.. సీతకి, గేమ్ ఛేంజర్ ఏమో.. నిఖిల్‌కి, మంద బుద్ధి ఏమో.. యష్మీకి ఇచ్చింది నైనిక. మొత్తానికి హౌస్ నుంచి నైనిక ఎలిమినేట్ అయిపోయింది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు