Entertainment
bigg boss 8: సపోర్ట్ చేయమంటూ RGV ఓపెన్ స్టేట్మెంట్

డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్ – సపోర్ట్ చేయమంటూ RGV ఓపెన్ స్టేట్మెంట్ – Ram Gopal Varma Tweet on Sonia
Bigg Boss 8 Telugu: ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బిగ్ బాస్ బ్యూటీ కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఆమెకు ఓటు వేయాలంటూ తన అభిమానులను కోరారు. ఈ మేరకు ఆమెతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Ram Gopal Varma Tweet on Sonia Akula: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు పూర్తయింది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం మరొకరిని బయటికి పంపేందుకు సోమవారం నామినేషన్స్ జరగగా.. ఆ రాత్రి నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ క్రమంలోనే ఎలిమినేషన్ అంచున ఉన్న ఓ అమ్మాయి కోసం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఆమెకు ఓటు వేయాలంటూ అభిమానులకు కోరుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. సోనియా ఆకుల. మరి సోనియా గురించి ఆర్జీవీ ఏమని ట్వీట్ చేశారో ఇప్పుడు చూద్దాం..
ఎనిమిదో సీజన్లోకి మొత్తం 14 మంది సెలెబ్రిటీలు ఎంటర్ కాగా.. అందులో తెలుగు అమ్మాయి సోనియా ఆరంభంలోనే అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. అందుకు తగ్గట్లుగానే హౌస్‌లోనూ తొలి రోజుల్లో ఎంతో యాక్టివ్‌గా ముందుకు సాగింది. కానీ, ఆ తర్వాత నుంచి తన ప్రవర్తనతో తరచూ విమర్శలను ఎదుర్కొంటూ వస్తుంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సోనియా.. నిత్యం పృథ్వీరాజ్, నిఖిల్ పక్కనే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నాలుగో వారం ఇంటి నుంచి వెళ్లేందుకు నామినేట్ కాగా.. అన్అఫీషియల్ పోల్స్‌లో తక్కువ ఓట్లతో ఈమెనె లాస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన ఆర్జీవీ: ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆమె కోసం రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆమెకు ఓట్ వేయాలని అభిమానులను కోరుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘సోనియా ఆకుల.. బలం, యాటిట్యూడ్‌కు నిదర్శనం. ఈ అమ్మాయి బిగ్ బాస్‌లో చాలా బాగా ఆడుతోంది. మీ ఓటును సోనియాకు వేసి ప్రేమను చూపించండి’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు సోనియాతో దిగిన ఫొటోను సైతం షేర్ చేశారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా: అంతకుముందు బిగ్ బాస్ షో అంటే తెలియదు అన్న రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య కాలంలో ప్రతి సీజన్లోనూ ఏదో ఒక కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతున్నారు. నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా ఉన్న అరియానా గ్లోరీకి మద్దతుగా ఓ ట్వీట్ చేయగా.. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన శ్రీ రాపాకకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన తెలుగమ్మాయి సోనియా ఆకులకు ఆర్జీవీ సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు సీజన్ ఆరంభంలో ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనూ ఓ వీడియోను పంపించి తన మద్దతును తెలిపారు.
నామినేషన్లలో ఏడుగురు.. ఆమె సేఫ్: మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు నామినేట్ ఉన్నారు. సోనియా, ఆదిత్య, పృథ్వీ, మణికంఠ, నైనిక, నబీల్, ప్రేరణ నామినేషన్లలోకి రాగా చీఫ్ అయిన కారణంగా నిఖిల్‌కు ఓ సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని వల్ల నామినేషన్లలో ఉన్న ఎవరో ఒకరిని నిఖిల్ సేవ్ చేసే ఛాన్స్ నిఖిల్‌కు రాగా.. అతడు నైనికను సేవ్ చేశాడు. దీంతో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. ఈ వారంలో వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. మరి ఆర్జీవీ ట్వీట్‌తో సోనియాకు ఓట్లు వేసే వారి సంఖ్య పెరుగుతుందో? లేదో? చూడాలంటే సండే వరకు ఆగాల్సిందే..!
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు