Telangana
‘నా ఫ్రెండ్స్ అంత్యక్రియలకు రావాలి’.. బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్..!

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని స్వాతిప్రియ ప్రాణాలు కోల్పోయింది.
స్వాతిప్రియ స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలిక పరిధిలోని పెర్కిట్ గ్రామం. ఉజ్వల-రవీందర్ దంపతులకు స్వాతిప్రియ(18) రెండో సంతానం. ఇక సోమవారం ఉదయం తన స్నేహితులు టిఫిన్ చేదాం రా అని పిలవగా.. స్వాతిప్రియ రానని చెప్పింది. ఆ తర్వాత అర గంటలోపే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆర్జీయూకేటీ సిబ్బందికి విషయం చెప్పారు. ఇక ఆమెను హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
అయితే స్వాతిప్రియ గదిలో సూసైడ్ లెటర్ దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆ లెటర్‌లోని కొన్ని పేజీలు బయటకు వచ్చాయి. మెుత్తం 6 పేజీల సూసైడ్ లెటర్‌ను పోలీసులు గుర్తించారు. కానీ అందులోని కొన్ని పేజీలను మాత్రమే బయటకు లీక్ అయ్యాయి. సూసైడ్ లెటర్‌లో తన కుటుంబం, విద్యార్థులు, కాలేజీ గురించి స్వాతిప్రియ ప్రస్తావించినట్లు వెల్లడైంది. అయితే సూసైడ్ లెటర్‌లో స్వాతిప్రియ రాసిన అంశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉందని.. అయినా తాను ఇక బతకలేనని చెప్పింది. తన అంత్యక్రియలకు స్నేహితులందరూ రావాలని కోరింది.
‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ధైర్యం సరిపోవటం లేదు. అయినా తప్పట్లేదు.. ఐ మిస్ యూ సో మచ్. అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క, తమ్ముడు.. మీకేం కష్టం వచ్చినా డాడీకి చెప్పండి. నాన్న మీరు ఇకనైనా స్మోకింగ్ చేయటం మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి. మన బంధువులందరూ విభేదాలను పక్కన పెట్టి నా అంత్యక్రియల్లో పాల్గొనాలి’ అంటూ స్వాతి ఆ సూసైడ్ లెటర్ లో రాసింది.
ఇక ఇదిలా ఉండగా.. బాసర క్యాంపస్‌లో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్వాతిప్రియ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరించారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని చూపించకుండానే మార్చురీకి తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ యాజమాన్యం తీరు బాగా లేదని.. సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నట్లు స్వాతిప్రియ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని కన్నీరు మున్నీరు అయ్యారు.
కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కాలేజీ క్యాంపస్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. అయితే బాసర క్యాంపస్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు