Entertainment
NBK 109 Movie Rajasthan Set ఎడారి సెట్ – షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే?

బాలయ్య NBK 109 కోసం రాజస్థాన్ ఎడారి సెట్ – షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే? – NBK 109 Movie Rajasthan Set
Balakrishna NBK 109 Movie Rajasthan Set : రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతమైన ఓ పల్లెటూరును తలపించేలా సెట్‌ను తీర్చిదిద్దింది ఎన్బీకే 109 టీమ్. పూర్తి వివరాలు స్టోరీలో.
Balakrishna NBK 109 Movie Rajasthan Set : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చూపిస్తున్న జోరు తెలిసిందే. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో వరుస విజయాలను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడాయన NBK 109 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్లడ్ బాత్కు బ్రాండ్ నేమ్, వయలెన్స్‌కు విజిటింగ్ కార్డ్ ఈ సినిమా క్యాప్షన్. భగవంత్ కేసరి వంటి భారీ హిట్ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమిది.
NBK 109 Movie Shooting Update : పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ భారీ సెట్ ఆకట్టుకుంటోంది. ఎడారి ప్రాంతం, రాజస్థాన్‌లోని పల్లెటూరును తలపించేలా ఈ సినిమా సెట్‌ను రూపొందించారు. దీన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో వేశారు. దండుమల్కాపురంలోని పారిశ్రామిక పార్కు పక్కనే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని దీన్ని వేశారు.
వాస్తవానికి ఈ సినిమా సెట్‌ను ఇరవై రోజుల క్రితమే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐదు రోజుల పాటు సినిమాను చిత్రీకరించారు. కాగా, ఈ చిత్రాన్ని దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హీరో, హీరోయిన్లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. అక్టోబరు మొదటి వారంలో షూటింగ్ పునఃప్రారంభం కానుంది.
NBK 109 Movie Cast and Crew : సితార ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ విలన్‌గా నటిస్తున్నారు. అలానే సినిమాలోని కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలపై టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్ చూసుకుంటున్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు