Connect with us

Andhra Pradesh

తిరుమల శ్రీవారి భక్తులకు మంచి వార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి.

తిరుమల శ్రీవారి భక్తులకు మంచి వార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి.

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల టికెట్లు టీటీడీ విడుదల చేయనుంది.ఈ రోజు 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే రూ.300 దర్శన టికెట్లు, అంగ ప్రదక్షిణలు, వసతి గదులు టికెట్లు టీటీడీ విడుదల చేస్తుంది. ఈ మేరకు ఆ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ బుకింగ్ కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ టికెట్లు పొందాలంటే, నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. తరువాత, నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు ఇవ్వబడతాయి.

తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవల టికెట్లలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల 2025 ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్ల కోసం ఫిబ్రవరి నెల టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెల ప్రత్యేక దర్శన టికెట్లను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. తిరుమల, తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.టీటీడీ, శ్రీవారి ఆర్జిత సేవలు మరియు దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలని సూచించింది.

తిరుమలలో ఇదేం పద్ధతి తెలంగాణ ఎమ్మెల్యే అసహనం పవిత్ర కార్తీక మాసంలో జరిగే కార్తీక వన భోజన మహోత్సవం భాగంగా, ఆదివారం తిరుమల వైభవోత్సవ మందపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం ఎంతో ఘనంగా జరిగింది. ఉదయం, స్వామి మరియు అమ్మవారిని ఉభయనాంచారులతో ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకెళ్లారు. ఆ తరువాత స్వామి మరియు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. సాధారణంగా కార్తీక మాసంలో టీటీడీ వనభోజనం పార్వేట మండపంలో నిర్వహిస్తుంది. కానీ ఈ ఏడాది భారీ వర్ష హెచ్చరికల కారణంగా వేదికను తిరుమల ఆలయం దగ్గరున్న వైభవోత్సవ మండపానికి మార్చారు.స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading

Trending