Connect with us

Andhra Pradesh

తుని ఆర్టీసీ డ్రైవర్‌కు మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు.. అదనంగా మరో మంచి ఆఫర్ కూడా ఇచ్చారు.

 Nara Lokesh Tuni RTC డ్రైవర్ డ్యాన్స్: కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. మంత్రి లోకేష్ స్వయంగా స్పందించడంతో వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యింది. అయితే డ్రైవర్ను అధికారులు సస్పెండ్ చేశారనే వార్తలొచ్చాయి. క్రమంలో మంత్రి లోకష్ స్పందించారు. డ్రైవర్పై సస్పెన్షన్ ఎత్తివేస్తారని.. ఆయన వెంటనే విధుల్లోకి వెళతారన్నారు. అలాగే ఆయన్ను నేను నేరుగా కలుస్తానని చెప్పి ట్వీట్ చేశారు. 

 కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే డ్రైవర్ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. క్రమంలో డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. 

 డ్రైవర్ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే డ్రైవర్ను సస్పెండ్ చేశారు అంటున్నాడు.. దయచేసి సంగతిని ఒకసారి చూడండి.. క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యమే కానీ, సరదాగా, ఎవరికీ హాని చేయకుండా చేసినది నేరం కాదుఅన్నారు. ట్వీట్పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. డ్రైవర్ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూనే.. మరో బంపరాఫర్ కూడా ప్రకటించారు. 

 ఆయన (డ్రైవర్) సస్పెన్షన్ ఆర్డర్స్ను తొలగిస్తారు.. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరవచ్చు. నేను అమెరికా నుంచి రాగానే.. ఆయన్ను (డ్రైవర్) వ్యక్తిగతంగా కలుస్తానుఅంటూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. ట్వీట్ చూసిన నెటిజన్లు మంత్రి లోకేష్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దమనసుతో స్పందించి డ్రైవర్కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

 రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో బస్సు రౌతులపూడి నుండి స్కూల్, కాలేజీ విద్యార్థులతో తునికి వెళ్లింది. అయితే, మార్గ మధ్యలో కోడూరు సమీపంలో సింగిల్ రోడ్డు ఉండడంతో, అదే రోడ్డులో వచ్చిన ఒక ట్రాక్టర్ ఆగిపోయింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.. అప్పుడు ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు బస్సు ఎదురుగా సరదాగా దేవర సినిమాలో పాటకు డ్యాన్స్ చేశారు. కొంతమంది మొబైల్ద్వారా రికార్డు చేయడంతో వీడియో సోషల్ మీడియాలో ప్రసారమైంది. వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు.. డ్యాన్స్ అదరగొట్టారంటూ ట్వీట్ చేశారు. 

Advertisement

 డ్రైవర్ వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులు విచారణ చేశారు. బస్సు ఆగిపోవడానికి కారణాలు, లోవరాజు డ్యాన్స్ వ్యవహారంపై ఆరా తీశారు. అప్పుడు ఆయన్ని విధుల నుంచి తొలగించారు. నిర్ణయంపై ఆయన క్షోభ వ్యక్తం చేశారు. ట్రాక్టర్ కారణంగా బస్సు ఆగిపోయిందని, సమయంలో సరదాగా డ్యాన్స్ చేశానని లోవరాజు చెప్పారు. తనకు డ్రైవింగ్ జీవనాధారమని.. తనను ఉద్యోగంలో కొనసాగించాలని కోరారు. అయితే ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా చేసిన విచారణలో, ట్రాక్టర్ ఆగిపోయిన కారణంగానే బస్సును అక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని తేలింది. అయితే డ్రైవర్ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసి లోకేష్ స్పందించారు. మరో వాదన కూడా ఉంది, లోవరాజు కాంట్రాక్టర్ డ్రైవర్ అని, ఆయనను సస్పెండ్ చేయలేము అంటున్నారు. 

Loading

Trending