Connect with us

Andhra Pradesh

పవన్ కళ్యాణ్ కోసం అభిమాని 1300 కిలోమీటర్ల నడక..

Pawan Kalyan Vijayawada Fan Walk To Kolkata విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ యువకుడికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిస్తే, విజయవాడ నుంచి కోల్‌కతాకు కాళీమాతను దర్శించుకోవాలని కాలి నడకన వెళ్లాలని అతను మొక్కుకున్నాడు.

ఈ క్రమంలో, ఆ యువకుడు 1,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాడు. ఇప్పుడు మరో 300 కిలోమీటర్లు నడిచి కాళీమాతను దర్శించుకోనున్నాడు. అతను తన మనసులోని మాటను కూడా వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభిమానం వల్ల ఓ యువకుడు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాడు. విజయవాడ నుంచి కోల్‌కతాకు వెళుతున్నాడు. మార్గమధ్యలో అతని గురించి తెలుసుకోగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. విజయవాడ 60వ డివిజన్ వాంబే కాలనీ ఈ బ్లాక్‌లో నివసించే దుర్గ మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీరాభిమాని. కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే, విజయవాడ నుంచి కోల్‌కతా కాళీమాత ఆలయానికి కాలి నడకన వెళ్తానని అతను మొక్కుకున్నాడు.

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిచి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా, దుర్గ మల్లేశ్వరరావు తన మొక్కుబడిని తీర్చుకోవాలని ఈనెల 5న విజయవాడ నుంచి కోల్‌కతా కాళీమాత ఆలయానికి కాలి నడకన బయల్దేరాడు. పవన్ అభిమాని ఇప్పటివరకు 1,000 కిలోమీటర్లు నడవగా, ఇంకా 300 కిలోమీటర్లు నడిచి కాళీమాతను దర్శించుకోనున్నాడు.

ఈ ప్రయాణంలో కొందరు అతనితో మాట్లాడారు. అతను తన కోరిక నెరవేరిన తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఒకసారి కలవాలని, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాడు. తన పాదయాత్ర పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానానికి సంకేతమని చెప్పాడు. ఈ సందేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సోషల్ మీడియా ద్వారా చేరాలని ఆశిస్తున్నాడు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను హోంమంత్రి అనిత కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి కోసం ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. 185 అగ్నిమాపక స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి సూచించారు.

Advertisement

Loading

Trending