Connect with us

Andhra Pradesh

అనంతపురంలో పెట్టుబడులకు అమెరికాలో మంత్రి లోకేష్.. టెస్లా ప్రతినిధులతో భేటీ

అమెరికాలో మంత్రి లోకేష్.. టెస్లా ప్రతినిధులతో భేటీ, , అనంతపురంలో పెట్టుబడులకు!

అమెరికా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పలు సంస్థల ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. టెస్లా సీఎఫ్‌వో వైభవ్‌ తనేజాతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.  అనంతపురం జిల్లా EV ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని వారందిరికి వివరించారు. సూపర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ, రాష్ట్రంలో EV ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌,  అమలులో సహకారం కోరారు. ఏపీలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన పెరోట్‌, టెస్లా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ముందుగా రాష్ట్రంలో ఏవియేషన్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవకాశాలు ఉన్నాయని లోకేష్ పెరోట్‌ గ్రూప్‌ అండ్‌ హిల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ రాస్‌ పెరోట్‌ జూనియర్‌తో సమావేశయం అయ్యి వివరించారు.. ఏపీ తీరప్రాంతం అలయెన్స్‌ టెక్సాస్‌ తరహా ప్రాజెక్టులకు అనుకూలమని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో హైవేలు,  పోర్టులు, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరగా.. పెరోట్‌ గ్రూప్‌ ఛైర్మన్ రాస్‌ పెరోట్‌ సానుకూలంగా స్పందించారు.

మరోవైపు నారా లోకేష్ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా (ఆస్టిన్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టెస్లా సంస్థ సమావేశమై ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనంతపూర్ జిల్లా  అనుకూలమని వివరించారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. టెస్లా నుంచి దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. Ap లో స్మార్ట్‌సిటీలు,సోలార్ పవర్, గ్రామీణ విద్యుదీకరణకు సోలార్ ప్లేట్స్ అమర్చడంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ కోరారు. EV ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధి, సూపర్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ అమల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని టెస్లా సీఎఫ్‌వోని రిక్వెస్ట్ చేశారు లోకేష్. టెస్లా ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌, బ్యాటరీ స్టోరేజీలో టెస్లా గ్లోబల్‌ లీడర్‌గా ఉందన్నారు వైభవ్‌ తనేజా.

అంతకముందు మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్యులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో.. పారిశ్రామికవేత్తలత సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌, వికేంద్రీకరణ, బిజినెస్‌ వైపు అడుగులు వేస్తోందన్నారు మంత్రి. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి తగిన విధంగా ఆరు పాలసీలను తీసుకొచ్చామని చెప్పారు.NRI ల నుండి  కూడా భారీగా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 50శాతం ఏసీలు, 25శాతం మొబైల్స్,  ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుతున్నాయన్నారు.

Advertisement

కర్నూలు డ్రోన్ వ్యాలీగా, చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌లుగా తయారు చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు మంత్రి. గుంటూరు ,కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌, ఉత్తరాంధ్రలో కెమికల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ పరిశ్రమలు, పెట్రో కెమికల్స్‌, , ఫార్మా రంగాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్‌ డేటా సెంటర్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని  కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు అలాగే మరికొందరు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను మంత్రి లోకేష్ కలిశారు. రాష్ట్రంలో పెట్టుడులకు ముందుకు రావాలని కోరారు..

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending