Entertainment
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘పుష్ప 2’ ట్రైలర్…

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పాటలు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. ఆగస్టులో రిలీజ్ రావాల్సిన పుష్ప 2 సినిమాను షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ కు వాయిదా పడింది. ఆలస్యం అయినా ఫలితం మాత్రం సాలిడ్ గా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా కోసం ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన సుకుమార్ షూటింగ్ విషయంలోనూ ఎక్కడ రాజీ పడకుండా షూట్ చేస్తున్నారట.
పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కీలక సన్నివేశాలను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలానే ఈ సినిమాకు కీలకమైన ఒక ఐటం సాంగ్ ను చిత్రీకరించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో ఐటం సాంగ్ చేయబోతున్నది ఎవరు అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ట్రైలర్ రిలీజ్ పై దర్శకుడు సుకుమార్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం నవంబర్ రెండో వారంలో పుష్ప 2 ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అవి విడుదలకు నెల రోజుల ముందే ట్రైలర్ విడుదల చేస్తున్నారు. పుష్ప 2 కి అదే జరుగుతుంది. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చే రెస్పాన్స్ ని బట్టి రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడం లేదంటే, ప్రమోషన్ వ్యూహాలను మార్చడం చేస్తూ వస్తున్నారు. సుకుమార్ సినిమా మేకింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, ప్రమోషన్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్ప 2 ప్రమోషన్ కోసం దాదాపు నాలుగు వారాల సమయం ఉండే విధంగా షూటింగ్ ను ముగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇక పోతే పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప కి మంచి పేరు దక్కింది. అందుకే పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. సౌత్ లోని అన్ని రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయడంతో పాటు నార్త్ లో కూడా కొన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసే విధంగా బిజినెస్ చేయబోతున్నారు. దేవర సినిమాను నార్త్ లో సొంతంగా విడుదల చేయడం జరిగింది. మరి పుష్ప 2 ని సొంతంగా రిలీజ్ చేస్తారా లేదంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి విడుదల చేస్తారా అనేది తెలీదు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప 2 సినిమా మరో భారీ విజయాన్ని వారి ఖాతాలో వేయడం ఖాయంగా యూనిట్ సభ్యులు అంతా చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు