Entertainment
పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్స్.. దేవీ శ్రీ ప్రసాద్‌ని పక్కన పెట్టి మరి..?

అల్లు అర్జున్ ప్రస్తుతం తన పుష్ప 2 సినిమాని ఎలా ప్రమోట్ చేయాలా? అని తెగ ఆలోచిస్తుంటాడు. సుకుమార్ అయితే చివరి నిమిషం వరకు చిత్రాన్ని ఎలా చెక్కాలి.. ఏం చేయాలి? అని ఆలోచిస్తుంటాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు జరుగుతున్నాయని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన అవుట్ పుట్ నచ్చలేదట. దాంతో ఇక తమన్, అజనీష్ వంటి వారిని రంగంలోకి దించి ఆర్ఆర్‌ను సపరేట్‌గా చేయిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఇలా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారేంట్రా బాబు.. అసలు టైం లేదంటే.. ఇప్పుడు మార్పులు చేర్పులు ఏంటి? అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు నిజంగానే దేవీ ఇచ్చిన అవుట్ పుట్ నచ్చలేదా? బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారా? రంగంలోకి తమన్ దిగాడంటూ వస్తున్న రూమర్లు నిజమేనా? అన్నది తెలియడం లేదు. అసలుకే ఇప్పుడు ఓ సినిమాను ఆర్ఆర్ ఎంతగా హైలైట్ చేస్తోంది.. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కూడా సినిమాలు చూస్తున్న ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది.
సుకుమార్ కూడా తన సినిమాలోని ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు. అలాంటిది ఆర్ఆర్ విషయంలో ఓ పట్టాన ఒప్పుకుంటాడని ఎవ్వరూ అనుకోరు. పుష్ప చిత్రంలో పాటలు బ్లాక్ బస్టర్ హిట్. ఆర్ఆర్‌కి కొన్ని చోట్ల కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే ఈ సారి ఎలాంటి తప్పులు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది.
అందుకే ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోకుండా రెండు ఎక్స్ ట్రా వర్షెన్స్‌ను రెడీ చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే తమన్, అజనీష్ వంటి వారితో స్పెషల్‌గా ఆర్ఆర్‌ను రెడీ చేయించుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి వీటిపై ఓ క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఆల్రెడీ ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చారు. మూవీ ఇంకో నెల రోజుల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ లోపు పాటల్ని, ట్రైలర్‌ను వదిలి సినిమా మీద అంచనాలు పెంచాల్సి ఉంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు