Entertainment
దేవరకి ఒక కోటి, పుష్ప 2కి 20 కోట్లు?.. అల్లు అర్జున్ స్టామినా..

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా మంచి సంచలనం క్రియేట్ చేసింది. కరోనా సమయంలో ఉత్తర భారతంలో హిందీ సినిమాలు సైతం పది కోట్ల వసూళ్లు సాధించేందుకు కిందా మీదా పడుతూ ఉంటే పుష్ప ప్రమోషన్ లేకుండానే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో పుష్ప 2పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు బాక్సాఫీస్ వర్గాలు పుష్ప 2 సినిమా వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించడం ఖాయం అనే నమ్మకం ఉంది. పుష్ప 2 వసూళ్లు వెయ్యి కోట్లు అనుకుంటున్నప్పుడు, ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లు చేసి పుష్ప రాజ్ అందరికీ షాక్ ఇచ్చాడు.
సినిమాకు రోజుకు రోజుకు పెరుగుతున్న బజ్ కారణంగా ప్రతి ఏరియాలో రికార్డులు సాధించడం ఖాయం అని నమ్ముతూ బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి ఏకంగా రూ.225 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్ట్ 1 వంద కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో నార్త్ లో ఏకంగా రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉందడు అనే టాక్ ఉన్న తమిళనాడు, కర్ణాటకలోనూ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ముఖ్యంగా కేరళలో పుష్ప 2 సినిమా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని చెప్తున్నారు. అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా ఇంత స్థాయిలో బిజినెస్ చేయవు. కానీ బన్నీ పీఆర్ మాఫియానో ఏమో గానీ.. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ ఇష్టమొచ్చిన లెక్కల్ని బయటకు వదులుతున్నారు. వాటిని చూసి బన్నీ ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోతోన్నారు.
ఇటీవల విడుదలైన దేవర సినిమా అక్కడ కేవలం రూ.1 కోటి లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేరళ రాష్ట్రంలో ఎన్టీఆర్ దేవర సినిమా లాంగ్ రన్‌లో రూ.2 కోట్ల చుట్టూ వసూళ్లు నమోదు చేసిందని తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు కేరళలో భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. బన్నీ క్రేజ్‌కు తగ్గట్టుగా అక్కడ మంచి బిజినెస్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. కానీ వీళ్లు ప్రచారం చేసుకుంటున్నంత రేంజ్‌లో అయితే లేదని తెలుస్తోంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి శ్రద్దా కపూర్ ఐటం సాంగ్ చేయబోతుందనే గాసిప్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాలో మళయాల స్టార్ నటుడు ఫాహద్ ఫసిల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నందు వల్ల కేరళలో అటు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డుల మోత మ్రోగిస్తున్న పుష్ప 2, రిలీజ్ తర్వాత ఇదే జోరు కొనసాగించేనా చూడాలి.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు