Entertainment
Pushpa 2: ఎట్టకేలకు ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2’. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ఈ మూవీ పై మరింత హైప్ పెంచేశాయి. ముఖ్యంగా ఈసారి పుష్పరాజ్, భన్వర్ సింగ్ షేకవత్ మధ్య జరిగే స్టోరీ చూసేందుకు పాన్ ఇండియా అడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేకపోవడంతో అసలు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇక తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
పుష్ప 2 ఫస్టాఫ్ లాక్ అయ్యింది.. అలాగే ఫుల్ ఫైర్ తో లోడ్ అయ్యిందని.. పుష్ప ఫస్ట్ అఫ్ లాక్ అండ్ లోడెడ్ అనే క్యాప్షన్ పెట్టి.. ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసేసారు. అల్లు అర్జున్ వెనక్కి నిలబడి కనిపించాడు. అంతకుమించి ఈ పోస్టర్లో పెద్దగా ఏమీ రివీల్ చేయకపోయినా చిత్రయూనిట్ నుంచి అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ చూసి అభిమానులు సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అధికారికంగా ప్రకటించారు.
నిజానికి పుష్ప 2 సినిమా, ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అది కాస్త లేట్ అయింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మేరకు తొలి హాఫ్ ఎడిటింగ్, రీరికార్డింగ్ తదితర పనులన్ని పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా మ్యూజికల్ హిట్ కూడా అయింది. డిసెంబర్ 6న ఈ సినిమా విడుదలవుతుండగా.. సంక్రాంతి వరకు పుష్ప 2 సందడి చేయనుంది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు