Telangana
మేడ్చల్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ASI..

అవినీతిని అరికడుతూ.. సమాజాన్ని రక్షించే పనిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా ఎదుటివారి బలహీనతలను అలుసుగా తీసుకోని.. అవినీతిపరులుగా మారిపోతున్నారు. ఒంటి మీద ఉన్న ఖాకీ డ్రెస్సుకు కనీస గౌరవం ఇవ్వకుండా.. రాబందుల్లా మారి లంచాలు వసూలు చేస్తున్నారు. అచ్చంగా అలా లంచం తీసుకుంటున్న ఓ పోలీస్ అధికారి స్టేషన్లోనే అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్లో జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు అనే ఆఫీసర్ లంచం తీసుకుంటూ సోమవారం (అంటే అక్టోబర్ 08న) ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ చెప్పిన వివరాల ప్రకారం.. విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైన్స్ వర్క్ చేస్తుంటాడు. శర్మ అనే ఓ వ్యక్తి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు విశ్వనాథ్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే శర్మ నుంచి 4 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకొని అతని పని మొదలుపెట్టాడు. అయితే.. పని పూర్తవ్వాలంటే ఇంకో 4 లక్షలు ఇవ్వాలని విశ్వనాథ్ శర్మ ని అడిగాడు. అయితే పని పూర్తి చేస్తేనే మిగతా డబ్బులు ఇస్తానని శర్మ గట్టిగానే చెప్పాడు. దాంతో.. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో.. శర్మ ఇంటికి తాళం వేసేశాడు ఈ విశ్వనాథ్.
దీంతో.. విశ్వనాథ్ మీద మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 2 నెలల క్రితం కేసు పెట్టాడు శర్మ. ఈ కేసును ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు విచారణ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న విశ్వనాథ్.. తనపై కేసు లేకుండా తప్పించాలని ASIని కోరాడు. అయితే అందుకు 2 లక్షలు ఖర్చు అవుతుందని.. విశ్వనాథ్‌తో చెప్పాడు ఈ మధుసూదన్ రావు. ఇక కేసు విచారణ చేపట్టిన మొదటి రోజే విశ్వనాథ్ దగ్గర నుంచి 10 వేల రూపాయలను తీసుకున్నాడు ASI. ఆ తర్వాత మరో 50 వేల రూపాయలు తీసుకురావాలని విశ్వనాథ్‌ను డిమాండ్ చేశాడు ఈ ASI.
దీంతో విశ్వనాథ్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో.. రంగంలోకి దిగిన ACB అధికారులు వాళ్ళు వేసిన ప్లాన్‌లో భాగంగా.. ASI మధుసూదన్ రావుకు కాల్ చేసి సోమవారం రోజు వచ్చి డబ్బులు ఇస్తానని విశ్వనాథ్ చెప్పాడు. ఆ ప్రకారమే.. విశ్వనాథ్ వెళ్లి మధుసూదన్ రావును కలిశాడు. కరెక్ట్ గా విశ్వనాథ్ నుంచి 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటున్న మధుసూదన్ రావును ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు. ఆ తర్వాత ASI మధుసూదన్ రావును నాంపల్లి ACB కోర్టులో ప్రవేశపెట్టారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు