International
2030 నాటికి చైనాకు 1000కిపైగా అణ్వస్త్రాలు ఉండే అవకాశం: అమెరికా రక్షణ నిఘా సంస్థ
వాషింగ్టన్:
చైనా సైనిక రంగంలో ఊహించని వేగంతో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలవాలనే లక్ష్యంతో, అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరే స్థాయికి చేరుకుంటోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ (Defense Intelligence Agency – DIA) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం, 2030 నాటికి చైనా 1000కి పైగా అణు వార్‌హెడ్‌లను (Nuclear Warheads) నిల్వ చేసుకోనున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశముందని DIA హెచ్చరించింది. ఇదే విధంగా చైనా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, సముద్ర, వాయు, అంతరిక్ష రంగాల్లోనూ భారీగా సైనిక పెట్టుబడులు పెడుతుందన్న విషయం నివేదికలో పేర్కొనబడింది.
చైనా అభివృద్ధిస్తున్న ఈ అణ్వాయుధ సామర్థ్యం అమెరికా సహా ఇతర దేశాలకు పెద్ద సవాలుగా మారే అవకాశముంది. ఇప్పటికే శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లు, అణు ఓడలు, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు వంటి ఆధునిక ఆయుధాల అభివృద్ధిలో చైనా ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలో భారతదేశం కూడా చైనాను ప్రధాన సవాలుగా పరిగణిస్తూ సైనికంగా తన శక్తిని గణనీయంగా పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి హైటెక్ ఆయుధాల అభివృద్ధిలో భారత్ వేగం పెంచిందని, ఈ ప్రాంతంలో ప్రభావాన్ని నిలుపుకునేందుకు భారత్ చర్యలు చేపడుతోందని విశ్లేషించారు.
భవిష్యత్తులో ఆసియా-పసిఫిక్ ప్రాంతం శక్తివంతమైన దేశాల మోహం కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వాయుధ నిబంధనల నేపథ్యంలో చైనా అభివృద్ధి చేస్తున్న ఆయుధ సంపత్తిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నివేదిక ప్రపంచ రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశముంది, ముఖ్యంగా అమెరికా, భారత్ వంటి దేశాల భద్రతా వ్యూహాలపై.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు