Latest Updates
హైదరాబాద్‌లో ‘జపాన్ ప్లాన్’: వరద నివారణకు అండర్‌గ్రౌండ్ టన్నెళ్ల ప్రతిపాదన
టోక్యో నగరాన్ని వరదల నుంచి కాపాడుతున్న అండర్‌గ్రౌండ్ టన్నెళ్ల తరహాలో హైదరాబాద్‌లో కూడా నిర్మాణం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో నగరంలో వరదలతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో, భారీ వరదలను తట్టుకునేందుకు ఆధునిక పద్ధతుల్లో నాలాల నిర్మాణం అవసరమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భావిస్తోంది. ఈ లక్ష్యంతో, వరద నివారణ ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA)కు GHMC ప్రతిపాదనలు సమర్పించింది. ఈ రుణం మంజూరుకు JICA సానుకూలంగా స్పందించడం గమనార్హం.
ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి జపాన్ పర్యటన బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. జపాన్‌లోని అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలను అధ్యయనం చేసిన అనంతరం, హైదరాబాద్‌లో ఇలాంటి ఆధునిక సాంకేతికతలను అమలు చేయాలనే ఆలోచన బలపడింది. టోక్యోలోని మెట్రోపాలిటన్ ఏరియా అవుటర్ అండర్‌గ్రౌండ్ డిశ్చార్జ్ ఛానల్ (G-Cans ప్రాజెక్ట్) వంటి విధానాలను హైదరాబాద్‌కు అనుగుణంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, హైదరాబాద్‌లో వర్షాకాల సమస్యలు గణనీయంగా తగ్గి, నగర ఆకర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. JICA రుణం ఆమోదం పొందితే, నగరంలో వరద నివారణకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా ఒక ముందడుగు పడినట్లవుతుంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు