Entertainment
సుప్రీంకోర్టులో లైంగిక వేధింపులకు గురయ్యా: బాలీవుడ్ నటి నిమ్రిత్ కౌర్ సంచలన వెల్లడి
బాలీవుడ్ నటి నిమ్రిత్ కౌర్ తాను 19 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టులో లైంగిక వేధింపులకు గురైన దారుణ అనుభవాన్ని వెల్లడించారు. లా చదువుతున్న సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ‘కోర్టురూమ్ లాయర్లతో నిండిపోయి ఉంది. జడ్జి వాదనలు వింటున్నారు. ఇంతలో ఎవరో నా వెనుక చేయి వేశారు. తిరిగి చూస్తే అతడు ఓ సీనియర్ లాయర్. పక్కకు జరిగినా మళ్లీ అదే విధంగా చేశాడు’ అని ఆమె ఆ ఘటనను వివరించారు.
తొలుత ఆందోళనకు లోనైనప్పటికీ, వెంటనే తేరుకుని ధైర్యంగా స్పందించినట్లు నిమ్రిత్ తెలిపారు. ‘అతడి చెంపపై గట్టిగా ఒక్కటి ఇచ్చి, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయా’ అని ఆమె చెప్పారు. ఈ సంఘటన తనలో ఎంతో ఆగ్రహం, భయం కలిగించినప్పటికీ, తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్య తనకు ధైర్యాన్నిచ్చిందని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థలోనూ ఇలాంటి వేధింపులు జరగడం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి రుజువు చేస్తోందని ఈ వెల్లడి సందర్భంగా చర్చ జరుగుతోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు