Connect with us

News

సీఎంను కలిసిన మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు

Hyderabad: కేబినెట్‌లో మా సామాజికవర్గానికి అవకాశమివ్వండి: సీఎంను కలిసిన  ఎమ్మెల్యేలు | several-mlas-met-cm-revanth-reddy

హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాలే యాదయ్య ఉన్నారు. మాదిగ సామాజికవర్గం నుంచి తమకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని వారు సీఎంను కోరినట్లు సమాచారం.

ఈ సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం, కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణపై రాష్ట్రంలో రాజకీయ చర్చలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశం ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending