International
వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి
వియత్నాంలో జరిగిన ఒక దుర్ఘటనలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన అర్షిద్ అష్రిత్ (21) వియత్నాంలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి ఒక ఇంటి గోడను బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అష్రిత్ అక్కడికక్కడే మృతిచెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఈ విషాదకర సంఘటన విషయం తెలిసిన వెంటనే అష్రిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారం చేసే అర్షిద్ అర్జున్, ప్రతిమ దంపతుల కుమారుడైన అష్రిత్, చదువులో రాణిస్తూ వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ ఊహించని ప్రమాదం అతని కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. స్థానికంగా ఈ ఘటన గురించి తెలిసిన వారంతా షాక్‌లో ఉన్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు