Connect with us

Entertainment

వార్ 2′ స్క్రిప్ట్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది: దర్శకుడు అయాన్ ముఖర్జీ

Here's why Jr. NTR turned down 'Brahmotsavam'

ముంబయి: యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో కీలక భాగంగా రూపొందుతున్న హై octane యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ చిత్రంలో పని చేయడం ఎంతో ప్రత్యేకమని, స్క్రిప్ట్ విన్న వెంటనే అవాక్కయ్యానని అయాన్ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో తన అనుభవాలు పంచుకుంటూ, అయాన్ ఇలా పేర్కొన్నారు:
“వార్ 2 స్క్రిప్ట్ నన్ను పూర్తిగా సర్ప్రైజ్ చేసింది. ఇది ఒక పవర్ఫుల్, ఎమోషనల్, డ్రమాటిక్ స్టోరీ. నేను మొదటిసారి స్క్రిప్ట్ విన్నప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోయాను. కథలోని మలుపులు, పాత్రల భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ ఎంతో బలంగా ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లో ఈ సినిమాను చూసినప్పుడు షాక్ అవుతారు.”

ఈ ప్రాజెక్ట్ ద్వారా తాను నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని, అతనితో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవమని అయాన్ చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు ఎన్.టి.ఆర్ (NTR) వంటి ఇద్దరు పాన్ ఇండియా స్టార్‌ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇది తనకు దక్కిన అరుదైన అవకాశమని, ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు.

కియారా అద్వానీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అయాన్ ప్రకటించారు. ఆమె పాత్రకు చాలా బలం ఉండబోతోందని, ఆమె కథలో సెన్సిటివ్ యెట్ స్ట్రాంగ ఎలిమెంట్‌కి ప్రాతినిధ్యం వహించబోతున్నదని తెలిపారు.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2025 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. “ఈ యాత్రలో ప్రతి ఒక్కరినీ మేము థ్రిల్ చేయబోతున్నాం. అద్భుతమైన అనుభవం మీకోసం సిద్ధంగా ఉంది” అని అయాన్ పేర్కొన్నారు.

Advertisement

 

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending