Connect with us

Andhra Pradesh

‘లోపలికి వెళ్తే ఏం చేస్తావ్?’.. పోలీసులతో అంబటి గొడవ

Ambati Rambabu : 'లోపలికి వెళ్తే ఏం చేస్తావ్?'.. పోలీసులతో అంబటి  గొడవ - Vaartha Digital News Telugu

గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు ‘వెన్నుపోటు దినం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు సమూహంగా యత్నించారు. అయితే, పోలీసులు కేవలం ప్రతినిధి బృందాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేయడంతో వివాదం తలెత్తింది.

ఈ విషయంపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన, ‘లోపలికి వెళ్తే ఏం చేస్తావ్? తోసుకెళ్తాం.. ఆపుకోండి’ అంటూ సీఐని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వేలు చూపిస్తూ పోలీసు అధికారిని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending