International
రోహిత్ శర్మకు ఘోర అవమానం?
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవల ఘోర అవమానం జరిగినట్లు క్రీడావర్గాల సమాచారం. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తనను కెప్టెన్‌గా కొనసాగించాలని, ఆ సిరీస్ మధ్యలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తానని రోహిత్ శర్మ బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా ఎంపిక చేస్తామని, కెప్టెన్సీకి ఇతర ఆటగాళ్లను పరిశీలిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం రోహిత్‌ను తీవ్రంగా నిరాశపరిచినట్లు తెలుస్తోంది.
ఈ అవమానంతో నొచ్చుకున్న రోహిత్ శర్మ వెంటనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. గతంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓడిపోవడం, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోవడంతో రోహిత్ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం రోహిత్‌ను మరింత గాయపరిచినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు బీసీసీఐ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, కొత్త టెస్టు కెప్టెన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు