Connect with us

News

రైతులపై దాడి అమానుషం: హరీశ్ రావు

రైతులకు అండగా ఉండండి: మాజీ మంత్రి హరీశ్ రావు..! | stand by the farmers  former minister harish rao

గద్వాల జిల్లాలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ క్రమంలో రైతులపై దాడులు చేయడం అమానుషమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ బౌన్సర్లు, పోలీసులు కలిసి రైతులపై విచక్షణారహితంగా దాడి చేశారని, 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై అకారణంగా కేసులు నమోదు చేసి, 12 మందిని రిమాండ్‌కు పంపినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిపైనే దాడులు చేయడం సిగ్గుచేటని హరీశ్ రావు అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతుల కడుపు కొట్టి, వారి భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం అలవాటుగా మారిందని హరీశ్ రావు విమర్శించారు. ఈ దాడులకు బాధ్యులైన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వ తీరును ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending