News
రైతును గెంటేసిన పోలీస్.. సర్వత్రా విమర్శలు
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై పోలీసు అధికారి దౌర్జన్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనం సృష్టించింది. తన భూసమస్యను చెప్పుకునేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధ రైతును ఏఎస్ఐ రాంచందర్ మెడపట్టి బయటకు నెట్టేశాడు. లైన్‌లో క్రమం దాటి ముందుకు వెళ్లాడనే కారణంతో ఈ అమానవీయ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు, స్థానిక ప్రజలు ఏఎస్ఐ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నదాతపై, అదీ వృద్ధుడిపై ఇలా ప్రవర్తించడం సరికాదని, కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిందని పేర్కొంటున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్ఐ రాంచందర్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ సంఘటన రైతుల సమస్యలు చెప్పుకునే వేదికల్లో అధికారుల వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తింది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు