Connect with us

International

రాన్ న్యూక్లియర్ కార్యక్రమం: రష్యా సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్ సరిహద్దులో న్యూక్లియర్ డ్రిల్స్: రష్యా సైన్యానికి పుతిన్ ఆదేశాలు  | Nuclear drills on Ukraine's border: Putin orders Russian military

ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో న్యూక్లియర్ వెపన్స్ తయారీ కార్యక్రమం కొనసాగుతోందని, ఆ దేశానికి అణ్వస్త్రాలు సప్లై చేసేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మెద్వెదేవ్ తన వరుస ట్వీట్లలో, “ఇజ్రాయెల్ మరియు అమెరికా చర్యలను ప్రపంచంలోని అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్యలతో యునైటెడ్ స్టేట్స్‌ను మరో యుద్ధంలోకి నెట్టారు” అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం చుట్టూ ఉన్న వివాదాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెంచుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి, భద్రతకు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending