Connect with us

International

మాల్దీవ్స్ కు భారత్ $50 మిలియన్ల సాయం

From defence to infra development, how India has always stood with Maldives  | Latest News India - Hindustan Times

భారతదేశంమాల్దీవ్స్ కు ఆర్థిక సహాయం అందిస్తూ మరోసారి తన స్నేహపూర్వక వైఖరిని చాటుకుంది. తాజాగా, మాల్దీవ్స్కు 50 మిలియన్ డాలర్ల (సుమారు 420 కోట్ల రూపాయలు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ట్రెజరీ బిల్స్ రూపంలో అందించనున్నారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ, భారత ప్రభుత్వానికి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం భారత్-మాల్దీవ్స్ మధ్య ఉన్న గాఢమైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ఇరు దేశాల మధ్య సహకారానికి ఒక నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సాయం మాల్దీవ్స్ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, దీని ద్వారా రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending