Latest Updates
మంగ్లీ బర్త్ డే వేడుకలో గంజాయి వివాదం: ఈరశపల్శో రిసారీల దాడి, 9 మందిపై కేస
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు గంజాయి వినియోగం కలకలం రేపాయి. హైదరాబాద్ శివారులోని ఈర్లపల్లి ప్రాంతంలో గల ఒక రిసార్ట్‌లో నిన్న (జూన్ 11) జరిగిన ఈ వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.
పక్కా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 9 మంది గంజాయి సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే, ఈ 9 మందిలో మంగ్లీ ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో గంజాయి, విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఈ వేడుకలకు హాజరైన వారిపై డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, కొందరికి గంజాయి సేవనం పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుగుతోంది. రిసార్ట్‌లో జరిగిన ఈ ఘటన హైదరాబాద్‌లో డ్రగ్ వినియోగంపై మరోసారి చర్చకు దారితీసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం పోలీస్ విభాగం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు