Connect with us

Andhra Pradesh

భూమి యజమానులకు గుడ్‌న్యూస్.. 22-ఏ భూములపై విముక్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భూముల సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపడుతోంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భూముల సమస్యలను పరిష్కరించడానికి కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా 22-ఏ నిషిద్ధ జాబితాలో తప్పుగా చేర్చిన భూములకు విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలతో ప్రారంభమైంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఇప్పుడు ఇది శ్రీకాకుళం జిల్లాకు చేరింది.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “మీ చేతికి.. మీ భూమి – 22ఏ భూమి స్వేచ్ఛ” పేరిట ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గతంలో లభించిన భూ రీ-సర్వేలో పొరపాట్ల వల్ల అర్హత ఉన్న భూములు కూడా 22-ఏ జాబితాలో చేరినట్లు రైతులు ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ డ్రైవ్‌లో భాగంగా, రైతులు మరియు భూ యజమానులు తమ భూమికి సంబంధించిన పత్రాలు, ఆధారాలతో నేరుగా అధికారులను సంప్రదించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడే చూపించారు. అర్హత ఉన్న భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. ప్రజల అభ్యంతరాలను నేరుగా వినడం, రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడే ఈ డ్రైవ్ సంకల్పం అని అధికారులు చెప్పారు.

ఏళ్ల తరబడి 22-ఏ సమస్యతో భూములను అమ్మాలనుకున్న, కొనాలనుకున్న భూ యజమానులు ఇప్పుడు ఊరట పొందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఉంటే భూముల కిర్య విక్రయాలకు మార్గం సాఫీ అవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అందుతున్నది.

#APLandIssues#22ALands#MeeChethikiMeeBhoomi#LandFreedom#APGovernment#ChandrababuNaidu#Srikakulam#LandReforms
#RevenueDepartment#FarmersRelief#APFarmers#LandRights#GoodNewsAP#BhoomiSamasyalu#RythulaSukhibhava
#APBreakingNews#AndhraPradesh#LandUpdate#PublicRelief

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *