Connect with us

Andhra Pradesh

భీమవరంలో మద్యం మత్తులో యువతి హల్‌చల్: రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అడ్డంకి

భీమ‌వ‌రంలో మ‌ద్యం మ‌త్తులో యువ‌తి హ‌ల్‌చ‌ల్.. వీడియో వైర‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఓ యువతి మద్యం మత్తులో హైవేపై హల్‌చల్ సృష్టించింది. భీమవరం-పాలకొల్లు హైవేపై ఫుల్‌గా మద్యం సేవించి, ఆమె రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

స్థానికులు, వాహనదారులు ఎంత చెప్పినా ఆమె అక్కడి నుంచి కదలకుండా ససేమిరా పడుకుంది. సుమారు 20 నిమిషాలపాటు రోడ్డుపైనే ఉండి, ట్రాఫిక్‌ను అడ్డుకుంది. ఈ ఘటనతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను రోడ్డు నుంచి పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని సమసిప్తం చేశారు.

ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక ప్రవర్తన ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending