Connect with us

International

ఫ్రాన్స్లో హోలీ.. 20వేల మంది ఒకేచోట

Holi in France

ఫ్రాన్స్‌లో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి! పారిస్‌లోని జార్డిన్ డి’అక్లిమటేషన్‌లో గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రంగుల పండుగలో సుమారు 20 వేల మంది పాల్గొన్నారు. ఎల్వీఎంహెచ్ సంస్థ, వాల్-డి-రూయ్ మేయర్ మార్క్-ఆంటోనీ జామెట్ సహకారంతో నిర్వహించిన ఈ వేడుకలు భారతీయ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించాయి. భారత రాయబారి సంజీవ్ సింగ్లా మాట్లాడుతూ, ఈ ఈవెంట్ భారత్-ఫ్రాన్స్ మధ్య స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించిందని అన్నారు. ఈ రంగుల సంబరాల ఫొటోలను భారత ఎంబసీ ఎక్స్‌లో పంచుకుంది.

మరోవైపు, ఓపీ సిందూర్ ఆపరేషన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ జెట్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ హోలీ వేడుకలు రెండు దేశాల మధ్య సాంస్కృతిక, రాజకీయ బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లోని భారతీయ సమాజం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending