Connect with us

Latest Updates

ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడతారా? ఆర్సీబీ ఓపెనర్‌పై సస్పెన్స్

Video: ఇదేం కర్మరా దేవుడా! ఫైనల్‌కు ముందు ఇంగ్లాండు వెళ్లనున్న RCB డేంజరెస్  బ్యాటర్? - Telugu News | RCB's Final XI Dilemma: phil Salt Out, Who Comes  In ipl 2025 | TV9 Telugu

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆడటంపై సస్పెన్స్ నెలకొంది. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు సాల్ట్ హాజరు కాకపోవడం ఈ అనిశ్చితికి కారణమైంది. సాల్ట్ తండ్రి కాబోతున్నారని, అందుకే తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సాల్ట్ ఆడతారా లేదా అనే విషయాన్ని ముందుగా వెల్లడిస్తే, ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో ఆర్సీబీ యాజమాన్యం ఈ విషయాన్ని సస్పెన్స్‌లోనే ఉంచినట్లు సమాచారం. ఈ సీజన్‌లో ఫిల్ సాల్ట్ 12 మ్యాచ్‌లలో 387 రన్స్ సాధించి జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో, ఫైనల్ మ్యాచ్‌లో అతడి పాల్గొనే అవకాశంపై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending