Connect with us

National

పోలవరం-బనకచర్ల’ను అనుమతించొద్దు: ఉత్తమ్

ఆంధ్రప్రదేశ్​ని ముందుకెళ్లకుండా ఆపండి' - కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ!

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌కు తెలంగాణ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. రేపు జరగనున్న పర్యావరణ అనుమతుల కమిటీ (EAC) సమావేశంలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను తిరస్కరించాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు హాని కలిగించే అవకాశం ఉందని, అందుకే దీనిపై ఎలాంటి అనుకూల నిర్ణయం తీసుకోవద్దని ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం (CWC) నుంచి అనుమతులు లేవని, అలాగే ఇది గోదావరి ట్రైబ్యునల్ నిర్ణయాలకు విరుద్ధంగా ఉందని ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ఎలాంటి అంచనాకు రావద్దని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల హితాన్ని కాపాడేందుకు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఉత్తమ్ పట్టుబట్టారు, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending