Connect with us

Business

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్: యుద్ధ భయాల నడుమ తగ్గిన బంగారం ధర.. నేటి తాజా రేట్లు ఇవే!

#బంగారంధర #పసిడిధరలు #గోల్డ్‌రేట్ #వెండిధర #హైదరాబాద్‌బంగారం #బంగారంకొనుగోలు #ముదుపు #ఆర్థికవార్తలు #యుద్ధప్రభావం #లలితాజువెల్లరీ #తనిష్క్ #బిజినెస్అప్‌డేట్స్

అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు, మార్చి 2వ తేదీ మధ్యాహ్నం నాటికి ఒక్కసారిగా దిగివచ్చాయి. ఉదయం భారీగా పెరిగిన ధరలు, మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి తులంపై రూ. 2 వేలకు పైగా పతనమవ్వడం విశేషం.

22 క్యారెట్ల బంగారం: తులం (10 గ్రాములు) ధర మధ్యాహ్నం సమయానికి రూ. 2,350 తగ్గి, ప్రస్తుతం రూ. 1,56,300 వద్ద కొనసాగుతోంది,ఇదే బంగారం ధర నేడు ఉదయం 10 గంటల సమయంలో గ్రాముకు రూ. 15,865 వద్ద ఉండగా, మధ్యాహ్నానికి రూ. 15,630కి పడిపోయింది.మలబార్ & కల్యాణ్ జువెల్లర్స్: ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి,పైన పేర్కొన్న ధరలు మధ్యాహ్నం 2:40 గంటల సమయానికి ఉన్నవి మాత్రమే. అంతర్జాతీయ పరిణామాల బట్టి సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఇవి మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు చేసే సమయంలో అదనంగా 3% జీఎస్టీ మరియు మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో (Spot Gold) ఔన్సు బంగారం 5,400 డాలర్ల వద్ద రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, దేశీయంగా గత రెండు రోజుల్లో జరిగిన భారీ పెరుగుదల సర్దుబాటు (Correction) కావడంతో ఈ తగ్గుదల కనిపిస్తోంది. అయితే వెండి ధర మాత్రం ఔన్సుకు 95 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *