Connect with us

Andhra Pradesh

నెల్లూరు, అనకాపల్లి వాసులకు గుడ్‌న్యూస్.. కొత్త రైలు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త సమయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్ వరకు రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి ఈ రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రైళ్లతో నెల్లూరు, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మరింత విస్తరించాయి.

బెంగళూరు నుండి బాలూర్‌ఘాట్‌కు ప్రయాణించాలనుకుంటున్నారా? బెంగళూరు–బాలూర్‌ఘాట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రాత్రి 10:15 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. ఈ రైలు నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా బాలూర్‌ఘాట్‌కు చేరుకుంటుంది. బెంగళూరు నుండి బాలూర్‌ఘాట్‌కు ప్రయాణించాలనుకుంటున్నారా? బెంగళూరు–బాలూర్‌ఘాట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రాత్రి 10:15 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. ఈ రైలు నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా బాలూర్‌ఘాట్‌కు చేరుకుంటుంది.

బాలూర్‌ఘాట్ నుండి బెంగళూరుకు వెళ్లే రైలు ప్రతి శనివారం బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 3 గంటలకు బెంగళూరు చేరుతుంది. ఈ రైలు ప్రయాణం కారణంగా ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లకు వెళ్లాలనుకునే వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.

ఇటీవల కాలంలో రైల్వే శాఖ ఏపీలో ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు రైళ్లకు కొత్త హాల్ట్‌లు మంజూరు చేయగా, పెందుర్తి, బారువ, తిలారు, ఇచ్ఛాపురం, కంచిలి వంటి స్టేషన్లలో రైళ్లు ఆగడం ప్రారంభమైంది. దీంతో దూరప్రాంతాల ప్రజలకు రైల్వే ప్రయాణం మరింత సులభమైంది.

కొత్త రైళ్లు, కొత్త హాల్ట్‌లతో ఏపీ రైల్వే నెట్‌వర్క్ బలోపేతమవుతుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#IndianRailways#SouthCentralRailway#NewTrainServices#WeeklyExpress#BangaloreToBalurghat#APRailNews#RailwayUpdates
#TrainConnectivity#PublicTransport#TravelByTrain#RailwayExpansion#AndhraPradesh#RailNews#SMVTBangalore#PassengerConvenience

Loading