Connect with us

Andhra Pradesh

తెలుగుజాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

TDP Mahanadu 2025: ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి | tdp mahanadu cbn  quote vision 2047 suchi

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు, తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉనికిని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహానాడు సభలో మాట్లాడుతూ, ఆయన తన నాయకత్వ ప్రస్థానం, పార్టీ పట్ల తన నిబద్ధతను వెల్లడించారు.

“దేవుడు ఇచ్చిన శక్తి మేరకు నేను టీడీపీ కోసం అవిశ్రాంతంగా పని చేశాను. నా బలం, నా బలగం టీడీపీ నాయకత్వమే. నా ఎన్నికకు సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాయకులు, కార్యకర్తలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎల్లవేళలా నిలబెట్టుకుంటాను,” అని చంద్రబాబు మహానాడు వేదికగా పేర్కొన్నారు.

చంద్రబాబు ఈ ప్రసంగం పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. ఆయన నాయకత్వంలో టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending