Connect with us

Entertainment

జైలర్ 2’లో ఏపీ పోలీస్‌గా నందమూరి బాలకృష్ణ?

Super Star Rajinikanth impressed by Veera Simha Reddy - JSWTV.TV

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రజనీకాంత్, బాలకృష్ణల మధ్య ఐదు నిమిషాల పాటు సాగే ఒక భారీ ఎలివేషన్ సీన్ ఉంటుందని, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. ఈ పాత్ర కేవలం కామియో కాకుండా గట్టి ఇంపాక్ట్ ఉన్న గెస్ట్ రోల్‌గా ఉంటుందని, బాలయ్య సుమారు 8-10 నిమిషాల పాటు స్క్రీన్‌పై కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ‘జైలర్ 2’ కోసం ఆయన 20 రోజుల షెడ్యూల్ కేటాయించినట్లు, ఈ పాత్ర కోసం రూ. 50 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా మీనన్ వంటి తారలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కామియోతో రజనీ-బాలయ్య కలయిక తెలుగు, తమిళ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending