Connect with us

Latest Updates

చేప ప్రసాదం మొదట తీసుకునేది ఆ కుటుంబమే!

Fish Medicine:ఈ రెండ్రోజుల పాటు చేప మందు పంపిణి..వృద్దులు,వికలాంగులకు  ప్రత్యేక ఏర్పాట్లుహైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేపు మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చేప ప్రసాదం నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బత్తిని కుటుంబ సభ్యులు మొదటగా చేప ప్రసాదాన్ని స్వీకరించనున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రజల సౌకర్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending