Business
గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త: RBI కొత్త మార్గదర్శకాలు
బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త వినిపించారు. త్వరలో గోల్డ్ లోన్‌లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రూ.2.5 లక్షల కంటే తక్కువ మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని 75 శాతం నుంచి 85 శాతానికి సవరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సవరణతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునే వారు మరింత ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, గోల్డ్ లోన్‌ల విషయంలో బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC)లకు ఏకరీతిలో మార్గదర్శకాలు అమలులో ఉండేలా RBI చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయం గోల్డ్ లోన్ తీసుకునే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు, రుణ విధానాల్లో సమన్వయం మరియు పారదర్శకతను పెంచనుంది.
ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తే, గోల్డ్ లోన్ మార్కెట్‌లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు