Connect with us

Entertainment

గోడ దూకి సినిమా షూటింగ్ కు..

Fauji : గోడ దూకి సినిమా షూటింగ్ కు వచ్చిన బాలీవుడ్ నటుడు - BigTvLive

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్‌కు హైదరాబాద్‌లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజి’ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ స్థలమైన అల్యూమినియం ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, డ్రైవర్ దారి తప్పడంతో అనుపమ్ ఖేర్ కారు తప్పుదారిలోకి వెళ్లింది. కారును రివర్స్ చేయడం సాధ్యం కాకపోవడంతో ఆయనకు ఓ అనూహ్య సమస్య తలెత్తింది.

కాంపౌండ్ గోడకు ఆనుకునే షూటింగ్ జరుగుతుండటంతో, సినిమా యూనిట్ సభ్యులు వెంటనే చాకచక్యంగా స్పందించారు. వారు నిచ్చెన సాయంతో అనుపమ్ ఖేర్‌ను గోడ దాటించి షూటింగ్ స్థలానికి తీసుకెళ్లారు. ఈ ఆసక్తికర సంఘటనను అనుపమ్ ఖేర్ తన X ఖాతాలో వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, అభిమానులు ఈ సరదా సంఘటనపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending