Andhra Pradesh
గుంటూరు జిల్లాలో దుర్ఘటన.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నంద్యాల, గుంటూరు జిల్లాలలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలలో మొత్తం ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు రక్తమోడాయి.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం వద్ద, ఆగి ఉన్న కారుకి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే సౌత్ డీఎస్పీ భానోదయ మరియు సీఐ వంశీధర్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో నల్లగట్ల–బత్తులూరు మధ్య జాతీయ రహదారి–40 పై మరో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి CGR ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నాలుగు మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్‌కు చెందిన గుండు రావు (60), శ్రావణ్ (22), నరసింహ మరియు బన్నీగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ప్రమాదానికి అతి వేగం మరియు నిద్రమత్తు కారణంగా ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ సంఘటనపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు రోదలు మరణించటం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి వెళ్తుండగా, ఆ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. వారిని ప్రత్యామ్నాయ బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు.
డిసెంబర్ మాసంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మరియు వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
#APRoadAccident#RoadAccident#NandyalAccident#GunturAccident#BreakingNews#RoadSafety#TrafficAlert#AccidentNews
#APNews#TelanganaVictims#PublicSafety#BeAlert#RoadsafetyAwareness
![]()
