india news
ఖమేనీ మరణంపై భారత్ వ్యూహాత్మక మౌనం: ఎందుకీ నిర్ణయం? గత చేదు జ్ఞాపకాలే కారణమా?
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ చనిపోయినప్పటికీ, భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సంతాపం ప్రకటించలేదు. ప్రతిపక్షాలు దీనిని తప్పుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది,2017 నుండి 2024 మధ్య ఖమేనీ పలుమార్లు భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నారు. ముఖ్యంగా కశ్మీర్ ముస్లింల అణచివేతపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం భారత్‌కు ఆగ్రహం తెప్పించాయి.భారత వ్యతిరేక పోస్ట్‌లు పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు ఢిల్లీ అల్లర్ల సమయంలో “భారత్‌లో ముస్లింల ఉనికి ప్రమాదంలో ఉంది” అంటూ ఖమేనీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది.
గల్ఫ్ దేశాలతో సంబంధాలు, ఇరాన్ దాడుల వల్ల ప్రభావితమైన సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలతో భారత్‌కు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఖమేనీ మరణాన్ని ఖండిస్తే ఈ దేశాలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది, ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా, పాకిస్థాన్ వంటి కొన్ని దేశాలు తప్ప, మెజారిటీ ప్రజాస్వామ్య దేశాలు (సుమారు 67 దేశాలు) ఖమేనీ మరణాన్ని ‘రాక్షస పాలన అంతం’గా అభివర్ణించాయి. భారత్ కూడా అదే దౌత్య మార్గాన్ని ఎంచుకుంది.
కెనడా ప్రధానితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు కానీ, ఎక్కడా ఖమేనీ పేరును ప్రస్తావించలేదు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని భారత్ పునరుద్ఘాటించింది. జాతీయ ప్రయోజనాలు మరియు గతంలో ఖమేనీ అవలంబించిన భారత్ వ్యతిరేక ధోరణి దృష్ట్యా న్యూఢిల్లీ ఈ ‘మౌన ముద్ర’ వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
![]()
