Business
కొత్త టూవీలర్ కొనుగోలుపై రెండు హెల్మెట్లు ఉచితం: 2026 నుంచి కేంద్రం కీలక నిర్ణయం
ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవిస్తున్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానున్న ఈ నియమం ప్రకారం, కొత్తగా కొనుగోలు చేసే అన్ని రకాల టూవీలర్లతో పాటు రెండు BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఈ నియమం రైడర్ మరియు పిలియన్ (వెనుక కూర్చునే వ్యక్తి) భద్రతను గణనీయంగా పెంచనుంది. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చని, దీనివల్ల ప్రాణాపాయ సంఘటనలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ద్విచక్ర వాహన వినియోగదారులలో హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు, రోడ్డు భద్రతపై అవగాహనను మరింత పెంచే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత, టూవీలర్ తయారీదారులు మరియు డీలర్లు BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న హెల్మెట్లను సరఫరా చేయడం తప్పనిసరి కానుంది. ఈ నియమం ద్వారా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడంలో గణనీయమైన మార్పు వస్తుందని కేేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆశిస్తోంది.
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు