Connect with us

Entertainment

కార్తి సినిమాలో నేచురల్ స్టార్?

Nani HIT 3 ott streaming on netflix faces unexpected twist from telugu  audience srinidhi shetty sailesh kolanu movie know more details | HIT 3 OTT  Streaming: ఓటీటీలో నాని 'హిట్ 3'కు ఊహించని ట్విస్ట్ -

తమిళ హీరో కార్తి, డైరెక్టర్ తమిజ్ కాంబినేషన్‌లో ఓ ఆసక్తికరమైన సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యే దశలో ఉండగా.. ఈ చిత్రాన్ని ప్రత్యేకతగా మార్చే ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే.. టాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రേക്ഷకుల మనసు గెలుచుకున్న నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నారట. ఇది నానికీ కార్తికీ కలిసిన రెండో ప్రాజెక్టు కావడం గమనార్హం.

ఇంతకుముందు నాని నటించిన హిట్ 3 సినిమాలో కార్తి అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే స్నేహాన్ని మరోసారి తెరపై చూడబోతున్నామనే వార్తతో నాని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక హిట్ ఫ్రాంచైజీ నాల్గవ భాగంలో కార్తి కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మరింతగా చెరగని ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా అధికారిక ప్రకటన రాలేనప్పటికీ, ఈ వార్తలు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రెండు ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ల కలయికపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ కాంబో నిజమే అయితే, ఈ ప్రాజెక్ట్‌ మరో క్రేజీ క్రాస్ ఇండస్ట్రీ సినిమా కావడం ఖాయం.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending