Connect with us

National

కామన్ సెన్స్తో నెలకు రూ.5 లక్షలు సంపాదన

కష్టాన్ని ఎంచుకో.. | కష్టాన్ని ఎంచుకో..Always Choose the Hard Way you will  get higher success

ఢిల్లీలోని ఓ సాధారణ ఆటో డ్రైవర్ తన తెలివితేటలతో నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. సాధారణంగా ఆటో డ్రైవర్లు రోజంతా కష్టపడి పనిచేసినా రూ.వెయ్యి కూడా సంపాదించడం కష్టం. కానీ, ఈ ఆటో డ్రైవర్ మాత్రం తన ఆలోచనా శక్తిని ఉపయోగించి, ఆటోలో కూర్చొని రోజుకు రూ.20 వేలు సంపాదిస్తున్నాడు. ఢిల్లీలోని యూఎస్ కాన్సులేట్ వద్ద ఈ వినూత్న ఆలోచనతో అతను ఈ ఘనత సాధించాడు.

యూఎస్ కాన్సులేట్‌లోకి సందర్శకులు తమ బ్యాగులను తీసుకెళ్లడానికి అనుమతి లేదన్న విషయాన్ని గమనించిన ఈ ఆటో డ్రైవర్, దీన్ని అవకాశంగా మలచుకున్నాడు. కాన్సులేట్ బయట తన ఆటోను పార్క్ చేసి, సందర్శకుల బ్యాగులను భద్రంగా ఉంచే సేవను ప్రారంభించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తూ, రోజూ సుమారు రూ.20 వేలు సంపాదిస్తున్నాడు. ఈ తెలివైన ఆలోచనతో అతను నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతూ, సామాన్యుడైనా అసామాన్య ఆలోచనలతో జీవితంలో ఎలా రాణించవచ్చో నిరూపిస్తున్నాడు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending