Connect with us

Latest Updates

కవిత వ్యవహారంపై BRS నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆగ్రహం

టీఆర్‌ఎస్‌ నేత రవీందర్‌రావు సంచలన వ్యాఖ్యలు | Takkellapalli Ravinder Rao  Sensational Comments On TRS | Sakshi

భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత తీరు సరైనది కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

“కవిత మాటలు క్షమించరాని స్థాయిలో ఉన్నాయి. ఆమె ఎందుకు అంత ఆవేశంతో మాట్లాడారు? కొంతైనా ఓపిక, సంయమనం ఉండాలి కదా? పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ లేఖ అంశంపై మాట్లాడతారు కదా? అంత తొందరపాటు ఎందుకు?” అని రవీందర్ రావు ప్రশ్నించారు.

ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నోటీసుల అంశంపై చర్చల్లో బిజీగా ఉన్నారని, ఈ విషయం కవితకు తెలియంది కాదని అన్నారు. “దేవుడిలాంటి కేసీఆర్‌పైనే దండెత్తేలా కవిత వ్యవహరిస్తున్నారా?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీ ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని, ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని రవీందర్ రావు సూచించారు.

ఈ వివాదం పార్టీలో అంతర్గత చర్చలకు దారితీసే అవకాశం ఉందని, ఈ అంశంపై కేసీఆర్ త్వరలో స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending