Connect with us

Andhra Pradesh

కన్నప్ప’లో రుద్ర పాత్రలో ప్రభాస్: మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

కన్నప్పలో 'రుద్ర'గా ప్రభాస్‌.. ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది | Prabhas As Rudra  First Look Out From Kannappa Movie | Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’లో ఆయన పోషించిన ‘రుద్ర’ పాత్ర గురించి నటుడు, నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని వివిధ పాత్రలను ప్రభాస్కు వివరించగా, ఆయన స్వయంగా ‘రుద్ర’ పాత్రను ఎంచుకున్నట్లు విష్ణు తెలిపారు. ఈ పాత్ర ప్రభాస్ నటనా జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మంచు విష్ణు మరిన్ని వివరాలు పంచుకున్నారు. “‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని పాత్రను జాగ్రత్తగా రూపొందించాం. ఈ చిత్రంలో రుద్ర పాత్ర సుమారు 30 నిమిషాల పాటు కనిపిస్తుంది. అభిమానులను సంతృప్తి పరిచేలా ఈ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దాం” అని విష్ణు వెల్లడించారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ ఈ పాత్రలో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending