Connect with us

News

ఒకవేళ వర్షం వచ్చిందంటే..

India vs England - ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..  ఐదు రోజులూ కష్టమే!

ఇంతకీ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా తొలి టెస్టు తొలి రోజు ఎలా గడిచిందో చూస్తే.. భారత జట్టు దుమ్మురేపింది. ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగుల వరద పారించింది. భారత ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించాలని ఆశిస్తున్నారు. కానీ ఆటలో ఒక్కోసారి ఆటగాళ్లు కాదు.. వాతావరణమే పెద్ద ఎడబాటు అవుతుంది కదా!

ఈ నేపథ్యంలో లీడ్స్ వాతావరణం మాత్రం ఆటగాళ్లకి కొంచెం కలవరాన్ని తెస్తోంది. ఉదయం ఎండలు ఉండే సూచనలున్నా.. మధ్యాహ్నానికి మాత్రం పరిస్థతి మారిపోయే అవకాశముందట. ప్రముఖ వాతావరణ సంస్థ AccuWeather ప్రకారం మధ్యాహ్నం వర్షం పడే అవకాశమో 86% ఉందట. అంతే కాదు.. ఉరుములతో కూడిన వాన పడే ఛాన్స్ కూడా 31% ఉందని చెబుతోంది.

ఒకవేళ వర్షం వచ్చిందంటే.. భారత బ్యాటర్ల జోరు కొంత తగ్గిపోవచ్చు. వాళ్లను ఆపలేని బౌలర్లు కాదు.. ఈసారి వరుణుడే ఆటకు బ్రేక్ వేసే ప్రమాదం ఉంది. పైగా టెస్టు మ్యాచ్ కదా.. ఒక్కరోజు నష్టం అయినా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే మ్యాచ్‌కి మంచి మోమెంటం తీసుకొచ్చిన భారత్.. వర్షం అడ్డుపడకుండా రెండో రోజు దూకుడుగా కొనసాగించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఫీల్డ్ లో వాళ్లు ఎలా ఆడతారో వేరు.. కానీ లీడ్స్ ఆకాశం మాత్రం మ్యాచ్‌కి అడ్డుపడితే మాత్రం అభిమానుల మానసిక స్థితి మాత్రం వర్షంతో పాటు తడిసిముద్దవడం ఖాయం!

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending