Connect with us

Latest Updates

ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు మిలిటరీ ట్రైనింగ్: మహారాష్ట్ర మంత్రి ప్రకటన

Basic military training to be given to students from Class 1 in  Maharashtra: Minister

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఒకటో తరగతి నుంచే ప్రాథమిక మిలిటరీ ట్రైనింగ్ అందించాలని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో శారీరక సామర్థ్యం పెరగడమే కాకుండా, క్రమశిక్షణ కూడా అలవడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని 2.5 లక్షల మాజీ సైనికులతో పాటు ఎన్‌సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్), స్కౌట్స్ సంస్థల సహకారం తీసుకోనున్నట్లు మంత్రి దాదా భూసే వివరించారు. ఈ చర్య విద్యార్థులకు దేశభక్తితో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending