International
ఉక్రెయిన్‌లో భీకర మిస్సైల్ అటాక్: 14 మంది మృతి, పలువురు గాయాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ మిస్సైల్ దాడికి తెగబడ్డది. నేడు జరిగిన ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 55 మందికిపైగా గాయపడినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ వార్తా సంస్థ తెలిపింది. దాదాపు 9 గంటలపాటు సాగిన ఈ దాడిలో, కమికేజ్ డ్రోన్స్, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ వందల సంఖ్యలో వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ అటాక్‌లో 12 కీలక ప్రాంతాలపై లక్ష్యంగా దాడులు జరిగాయని నివేదికలు పేర్కొన్నాయి. ఆసుపత్రులు, నివాస భవనాలు, విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మిస్సైల్ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీయనున్న సూచనలు కనిపిస్తున్నాయి.
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు