Connect with us

International

ఉక్రెయిన్పై రష్యా దాడి.. శాంతి చర్చలు లేనట్లేనా?

Ukraine in maps: Tracking the war with Russia

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దుందుగుల దాడులకు తెరలేపింది. గత రాత్రి రష్యా దాదాపు వందకు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ బలగాలు ప్రకటించాయి. ఈ దాడులు దేశంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు ఎలాంటి అవకాశం కనిపించడం లేదనే ఆందోళన నెలకొంది.

ఈ నెల 15వ తేదీన టర్కీలోని ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, చర్చలకు ముందు 30 రోజుల పాటు కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) పాటించాలని జెలెన్స్కీ ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనను పుతిన్ తోసిపుచ్చారు. దీంతో శాంతి చర్చలకు మార్గం సుగమం కాకపోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో రష్యా దాడులు కొనసాగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending